సంతోషి మాత దేవాలయ అభివృద్ధికి 50 వేల విరాళం అందజేత...

 సంతోషి మాత దేవాలయ అభివృద్ధికి 50 వేల విరాళం అందజేత...

నాగర్ కర్నూల్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో గల సంతోషిమాత దేవాలయనికి, అభివృద్ధి కొరకు కార్తిక శుక్రవారం నాడు నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన టాక్స్ కన్సల్టెంట్, వ్యాపారి గాజుల సురేష్ ,స్వాతి దంపతులు సంతోషిమాత ఆలయ కమిటీ సభ్యులకు దేవాలయంలో 50వేల రూపాయలు అందజేశారనీ ఆలయ ప్రధాన అర్చకులు అల్లాడి ప్రకాష్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న భక్తులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయని అన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సురేష్ స్వాతి దంపతులనుశాలువలతో,అమ్మవారి ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆంజనేయస్వామి,రామాలయం, సంతోషిమాత దేవాలయానికి కార్తిక దీపారాధనకు సరిపోను నువ్వుల నూనె డబ్బాలను అదే కాలానికి చెందిన బ్యాంక్ రిటైర్డ్ అధికారి పీ.విజయలక్ష్మి అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భాగ్యమ్మ, శివకుమార్, రాజేశ్వరి, మొల్గర వేణుగోపాలరావు, నరసింహారావు, జీయర్, శ్రీనిధి, భక్తులు పాల్గొన్నారు.









Previous Post Next Post