జడ్పీహెచ్‌ఎస్ బాలుర బాదేపల్లి పాఠశాలను సందర్శించిన డీఈవో ప్రవీణ్ కుమార్
జడ్చర్ల రూరల్, నవంబర్ 6 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర బాదేపల్లి పాఠశాలను గురువారం విద్యా జిల్లాశాఖాధికారి ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అప్పర్ ఐడీ జనరేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్‌ను ఆయన పరిశీలించారు. అలాగే పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖగోళ శాస్త్ర ప్రయోగశాల, వంటగది, ఔషధ మొక్కల తోటలను పరిశీలించారు. పాఠశాల పరిసరాల శుభ్రత, నిర్వహణ విధానము పట్ల డీఈవో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, స్టాఫ్ సెక్రటరీ గోపాల్, ఉపాధ్యాయులు ఉన్నారు.
