తాండ్ర సర్పంచ్‌గా ఆశదీప్ రెడ్డి బరి
కాంగ్రెస్ అభివృద్ధి పథకాలను గ్రామానికి తీసుకురావడమే లక్ష్యం
కల్వకుర్తి, నవంబరు 27 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తాండ్ర గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి కాయితి ఆశదీప్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు, గ్రామస్థుల భారీ ర్యాలీతో మండల కేంద్రానికి చేరుకున్న ఆశదీప్ రెడ్డి నామినేషన్ తరువాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామానికి అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందని ఆయన అన్నారు. గ్రామాల్లో రహదారులు, శుద్ధి నీరు, మహిళా సంక్షేమం, రైతు ప్రోత్సాహకాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని ఎత్తిచూపారు. గ్రామాభివృద్ధి నిధుల పారదర్శక వినియోగం, ప్రతి కుటుంబం అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం… ఇవన్నీ తన ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామాలు మరింత ముందుకు సాగుతున్నాయి. తాండ్ర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటం నా లక్ష్యం అని ఆశదీప్ రెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆశదీప్ రెడ్డికి ఐకమత్యం ప్రకటించారు.



