పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ట..

 ధ్వజస్తంభం పునఃప్రతిష్ట.. 

అమ్మవారి ఆశీస్సులు అందుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

నవాబుపేట, నవంబరు 26 (మనఊరు ప్రతినిధి): పర్వతాపూర్ గ్రామంలో మైసమ్మ దేవాలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మాజీ మంత్రి డాక్టర్. సి. లక్ష్మారెడ్డి హాజరైన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. స్థానిక భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్. సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పర్వతాపూర్ మైసమ్మ ఆలయం ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ట గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు శుభ సంకేతం అని తెలిపారు. భవిష్యత్తులో దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. 



Previous Post Next Post