జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం‌..

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం‌.. 

కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ కిందికి

ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు 

జడ్చర్ల, నవంబరు 26 (మనఊరు ప్రతినిధి): మండలంలోని మాచారం, జడ్చర్ల 147వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఒక కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్‌ రోడ్డుపై నుంచి కిందికి పడిపోగా, ట్రాక్టర్ నడుపుతున్న యాకన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమాచారం అందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన యాకన్నను జిల్లా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కారు నాగర్‌కర్నూల్‌కు చెందిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Previous Post Next Post