ఫకీర్ జహంగీర్ పాషాను సన్మానించిన ఆలియా సుల్తానా

ఫకీర్ జహంగీర్ పాషాను సన్మానించిన ఆలియా సుల్తానా

జడ్చర్ల రూరల్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): బిసి జేఐసి కో-కన్వీనర్‌గా నియమితులైన ఫకీర్ జహంగీర్ పాషాను సయస్తుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు ఆలియా సుల్తానా శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సయస్తుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయం ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలియా సుల్తానా మాట్లాడుతూ, “ఫకీర్ జహంగీర్ పాషా సామాజిక సేవాభావం కలిగిన వ్యక్తి. పసుమంద ముస్లిం సమాజ అభివృద్ధికి, హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తిత్వం ఆయనది. వీరి ఆలోచనలు, సద్భావనలు యువతకు, సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పసుమంద ముస్లిం సమాజానికి న్యాయం చేకూర్చే దిశగా మరిన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని, కో-కన్వీనర్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంఘ సభ్యులు, స్థానిక నాయకులు మరియు సామాజిక సేవకులు పాల్గొన్నారు.

Previous Post Next Post