భగ్గుమన్న కూరగాయల ధరలు

 బాలానగర్‌లో భగ్గుమన్న కూరగాయల ధరలు

ధరల పట్టిక లేవని వినియోగదారుల ఆగ్రహం

బాలానగర్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వారాంతపు కూరగాయల సంతలో కూరగాయల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ధరల పట్టికలు లేకపోవడంతో కొంతమంది దళారులు కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. చిక్కుడు, బెండ, దొండ, క్యారెట్ కిలో రూ.80కు, పచ్చిమిర్చి రూ.60కు, టమాటా రూ.30కు విక్రయించగా, ఇతర కూరగాయల ధరలు కూడా ఎగసిపడుతున్నాయి. రోజువారి జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కూరగాయల ధరల పెరుగుదల మరింత భారంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంతలో ధరల పట్టికలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఖరారు ధరలను అమలు చేయాలని, దళారుల మోసాల నుంచి వినియోగదారులను రక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.



Previous Post Next Post