కిక్స్‌తో కొత్త చరిత్ర…
లింకా బుక్‌లో నాగర్ కర్నూల్ విద్యార్థుల రికార్డు
ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి రమాకాంత్
నాగర్‌కర్నూల్, నవంబరు 26 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫిక్స్ ఛాలెంజ్లో నగర్‌కర్నూల్ జిల్లా కరాటే విద్యార్థులు తమ ప్రతిభను చాటుకొని ప్రపంచ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాలకు పైగా చెందిన 1200 మంది విద్యార్థులు పాల్గొని, గతంలో నమోదైన 7,86,000 కిక్స్ రికార్డును బద్దలు కొట్టి, తాజా రికార్డ్ 8,56,400 కిక్స్‌తో కొత్త ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. ఈ విజయంతో లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కిందని మాస్టర్ లవ కుమార్ తెలిపారు. విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్న నాగర్‌కర్నూల్ విద్యార్థులు స్టైల్ చీఫ్ రంగ్ మల్లికార్జున్ గౌడ్ మార్గదర్శకత్వంలో గతంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇప్పుడు లింకా వరల్డ్ రికార్డ్లో స్థానం సాధించడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రమావత్ ముగ్ధ, స్నీతిక, మహతి, రామ్‌చరణ్, సాయి చైతన్య, అద్విత్ రెడ్డి, రక్షిత, క్రిస్టినా, దృచి శ్రీ తదితరులు ప్రతిభా ప్రదర్శనలు కనబరిచారు. క్లాస్ మెంట్ క్లబ్ వాస రాఘవేంద్ర, ప్రధాన అతిథిగా హాజరైన జిల్లా జడ్జి రమాకాంత్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.









