చదువులమ్మ ఒడికి చేరుకుంచన రణ్…
మానవత్వం చాటుకున్న ఉపాధ్యాయుడు మునగాల సతీష్ కుమార్
ఏడేళ్లుగా చదువుకు దూరమైన సాయిచరణ్
విద్యా వెలుగులు చూపిన సతీష్ కుమార్
కల్వకుర్తి, నవంబరు 27 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి పట్టణంలోని ఎస్బీఎంఎస్ చాత్రోపాధ్యాయలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సున్నపు లింగయ్య, వెల్దండ గ్రామానికి చెందిన కుటుంబంలో చదువుకు దూరంగా ఉన్నారు సిడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థి సాయి చరణ్ పరిస్థితిని గుర్తించి, అతనిని మళ్లీ విద్యబాట పట్టించిన స్థానికుడు ఉపాధ్యాయుడు మునగాల సతీష్ కుమార్ చేసిన సేవ అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఏడు సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రానికీ వెళ్లని చిన్నారి పరిస్థితిని గమనించిన సతీష్ కుమార్ కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ చేసి, చదువుకు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం స్థానిక బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్, కిషోర్‌లతో కలిసి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని విద్యార్థి తల్లిదండ్రులు ఎదిరే రేవతి, రవి, తాత, అమ్మమ్మలను నచ్చజెప్పి ప్రత్యేక విద్య అవసరాన్ని తెలియజేశారు. చిన్నారి తర్వాత తన స్వంత వాహనంలో తీసుకెళ్లి కల్వకుర్తి హరిజనవాడ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఎస్. లావణ్య, స్పెషల్ సెకండరీ టీచర్‌తో మాట్లాడి ప్రత్యేక విద్యార్థి పాఠశాలలో చేర్చారు. ప్రస్తుతం చరణ్ ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతుండగా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కూడా తాను సాయపడతానని సతీష్ కుమార్ హామీ ఇచ్చిన గ్రామ పెద్దలు, ఉపాధ్యాయుల సంఘాలు, స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంది. బాధ్యత సామాజికంగా ఒక విద్యార్థి జీవితంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గ్రామంలో ఆదర్శంగా నిలిచింది.


