జ్ఞాన సరస్వతి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో లలిత
పారాయణ పఠనం...
నాగర్ కర్నూల్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గరలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో కార్తీక శుక్రవారం నాడు సామూహిక లలిత సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన పారాయణ పఠనం మహిళా భక్తులచే భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పి. నవీన్ కుమార్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు దేవాలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి లలితా సహస్ర నామ పారాయణ కమిటీ మహిళా భక్తులచే లలితా సహస్రనామాలు, మణిద్వీప వర్ణన, లింగాష్టకం సామూహికంగా పారాయణం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులందరిచే సామూహికంగా కుంకుమార్చన శాస్త్రోక్తంగా వేదమంత్రచరణల మధ్య నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ పూజలలో భక్తులందరికీ వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదలతో పాటు నిత్య అన్నప్రసాద శాలలో అన్నప్రసాద పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పారాయణ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.


