ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

 ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి 

సొసైటీ అధ్యక్షులు ఫాదర్ రాజారెడ్డి


జడ్చర్ల, నవంబర్ (మనఊరు ప్రతినిధి): ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నవజీవన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఫాదర్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మునిసిపాలిటీ మూడవ వార్డులోని చింతపండు స్కూల్ సమీపంలోని నవజీవన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే సమాఖ్య ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, షుగర్, బీపీ, కంటి పరీక్షలు, దంత పరీక్షలు తదితర విభాగాల నిపుణ వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా చికిత్స ఫలితాలు మెరుగుపడతాయని, అందుకే కుటుంబ సభ్యులతో కలిసి శిబిరాలకు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఫాదర్ రాజారెడ్డి ప్రజలను కోరారు. గ్రామీణ ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను తరచూ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు యశస్విని, అనూష, అరుణ్, వర్ష, తిరుపతమ్మ, రాజేశ్వరి, సాయికిరణ్, చక్రి, స్నేహ, మురళి, రమణ, వాణి, విజయ్, పిఆర్ఓలు గౌరీశంకర్, మనోహర్, నిర్వాహకులు మర్తా డేవిడ్, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.









Previous Post Next Post