కేశంపేట మండలంలో నామినేషన్ల పర్వం ముగిసింది

29 గ్రామపంచాయతీల్లో 205 మంది సర్పంచ్ అభ్యర్థులు

వివరాలు వెల్లడించిన రిటర్నింగ్ అధికారులు

కేశంపేట, నవంబరు 30 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కేశంపేట మండలంలో శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గురువారం ప్రారంభమైన ఈ ప్రక్రియలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని మొత్తం 29 గ్రామ పంచాయతీలకు గాను 205 మంది సర్పంచ్ పదవికి నామినేషన్లు వేయగా, 260 వార్డులకు మొత్తం 778 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఇందులో దేవునిగుడి తాండా గ్రామపంచాయతీలో ఒక్క సర్పంచ్ నామినేషన్ మాత్రమే దాఖలవడంతో ఆ పదవి ఏకగ్రీవం కానున్న అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మండలవ్యాప్తంగా నామినేషన్ల దాఖలు సందర్భంగా గ్రామాల వద్ద సందడి నెలకొనగా, అభ్యర్థులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు భారీగా పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు..

Previous Post Next Post