నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్నాయి
సైబర్ జాగృక్ దివస్ సందర్భంగా అవగాహన సదస్సు
జడ్చర్ల, నవంబర్ 6 (మన ఊరు ప్రతినిధి): నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్నాయని ఎస్పీ డి.జానకి అన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో సైబర్ జాగృక్ దివస్ సందర్బంగా జడ్చర్ల పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్ములు, నకిలీ ఐపిఓలు, పార్ట్ టైం జాబ్స్ పేరుతో జరిగే మోసాలు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని వివరించారు. ఇవే కాకుండా డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ సంబంధిత కైబర్ మోసాల గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.
సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి, వాట్సాప్ నంబర్ 8712672222కి కూడా సమాచారం ఇవ్వండి ఇవ్వబడింది. ప్రజల సందేహాలకు ఎస్పీ గారు మరియు సైబర్ క్రైమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రావణి గారు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా విమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రావణ్, షీ టీం సిబ్బంది, హెచ్‌టియు కళాబృందం సభ్యులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు. పట్టణ ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు అధిక సంఖ్యలో ఉన్నారు.



