మానవతా దృక్పథం చాటుకున్న వెంకటాచారి

 మానవతా దృక్పథం చాటుకున్న మాజీ వైస్ ఎంపిపి వెంకటాచారి

బాలానగర్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా నిలిచే మనసున్న నాయకుడిగా పేరుగాంచిన బాలానగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి సమకూర్చిన కంచరి శివలీల కుమార్తె సంధ్య పెళ్లికి రూ.13,500ల పుస్తే మెటళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటాచారిని గ్రామస్థులు అభినందించారు. ఈ సాయంతో కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ సాయం ఎంత ఇచ్చామన్నది కాదు... కష్టంలో ఉన్న వారి పక్కన నిలబడే అవకాశం రావడం మా నిజమైన అదృష్టం. మనిషికి మానవతా హృదయం ఉంటే చాలు, అది అతని గొప్ప ధనం అన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎవరు అడిగినా ముందుండి సహాయం చేసే నేత. అధికారమే కాదు… మనసే ఆయన అసలు బలం అని ప్రశంసించారు.

Previous Post Next Post