కాకర్జాల సర్పంచ్‌గా మాడభూషి రాజు ఏకగ్రీవ ఎంపిక

 కాకర్జాల సర్పంచ్‌గా మాడభూషి రాజు ఏకగ్రీవ ఎంపిక

నవాబుపేట, డిసెంబరు 1 (మనఊరు ప్రతినిధి): నవాబుపేట మండలంలోని కాకర్జాల గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజకీయాలలో అపార అనుభవశాలి మాడభూషి రాజును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా రాజుతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన కావలి యాదయ్య, కావలి అంజయ్య, గోవు యాదయ్య, కావలి చెన్నయ్య, గుర్రంపల్లి మల్లమ్మ, గుర్రంపల్లి జ్యోతి లను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అర్థ శతాబ్దం నుండి క్రియాశీలక రాజకీయాలలో కొనసాగుతున్న మాడభూషి రాజు 1981–1986 మధ్య ఉమ్మడి దేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా సేవలందించారు. ఆయన సేవలను గ్రామానికి మరోసారి వినియోగించుకునాలనే సదుద్దేశంతో గ్రామస్తులు ఆయనను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అనేకమంది ప్రముఖులు ఆయనను అభినందించగా అనేకమంది రాజకీయ, రాజకీయేతరులు శుభాకాంక్షలు తెలిపారు.






Previous Post Next Post