పాఠశాలలో విద్యార్థులచే మాదిరి పార్లమెంట్ సభ
బిజినపల్లి, డిసెంబరు 2 (మనఊరు ప్రతినిధి): విద్యార్థుల్లో పార్లమెంట్ ప్రక్రియలపై అవగాహన పెంపొందించేందుకు బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సాయంత్రం మాదిరి పార్లమెಂಟ್ సభను విద్యార్థులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం జి. మురళీమోహనచార్యులు మాట్లాడుతూ పార్లమెంట్ కార్యకలాపాలు, సభా పద్ధతులు, ప్రశ్నోత్తర వ్యవస్థపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తమైందన్నారు. మంగళవారం ఉదయం నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. మాదిరి పార్లమెంట్ సభలో కె. తులసి రాష్ట్రపతిగా, జీ. గీత లోక్‌సభ స్పీకర్‌గా, స్వాతి ప్రధానమంత్రిగా, హిమవంతు ప్రతిపక్ష నాయకుడిగా, పి.వి. పావని పార్లమెంట్ కార్యదర్శిగా వ్యవహరించారు. వివిధ శాఖల మంత్రులుగా ఇతర విద్యార్థులు బాధ్యతలు స్వీకరించి, దేశంలోని వివిధ సమస్యలపై ప్రశ్నోత్తరాల నిర్వహణ చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎం. కృష్ణకుమార్, హుస్సేన్, ఏ. హనుమంత్ రెడ్డి, ఏ. వెంకటస్వామి, నాగిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





