నడుస్తున్న కారులో మంటలు
తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ నలుగురు యువకులు
కల్వకుర్తి, కడ్తాల్, డిసెంబరు 3 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మక్తమాదారం శివారులో మంగళవారం ఉదయం జరిగిన ఘటనలో నడుస్తున్న కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాకు చెందిన నలుగురు యువకులు మారుతి ఆల్టో కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా కడ్తాల్, షాద్‌నగర్ రోడ్‌లోని మక్తమాదారం గేటు వద్ద కారు నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం గమనించడంతో డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపాడం జరిగింది. దీంతో కారులో ఉన్న నలుగురు యువకులు అలర్ట్‌గా బయటకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని క్షణాల్లోనే మంటలు పెరిగి కారు మొత్తం దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


