పలు విభాగాల్లో ఇండియన్ ఐకాన్ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్, డిసెంబరు 7 (మనఊరు ప్రతినిధి): తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ, నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ దక్షిణ భారత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జనవరి 12 నుంచి 23, 2026 వరకు జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న వారికి కింది పురస్కారాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు
జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ ఆచార్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, కార్యనిర్వాహక కమిటీ కన్వీనర్ పొన్నెకంటి శ్రీనివాసాచారి, కో-ఆర్డినేటర్ డాక్టర్ వేముల తిరుపతిరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు.
పురస్కారాలు ఇవి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ అవార్డు, స్పోర్ట్స్ ఇండియన్ ఐకాన్ అవార్డు, యూత్ ఇండియన్ ఐకాన్ అవార్డు, ఉమెన్ ఇండియన్ ఐకాన్ అవార్డు, భారత స్ఫూర్తికిరిటీ అవార్డు, నటరాజ పురస్కారం, మహానంది పురస్కారం. ఏ రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎవరెవరు దరఖాస్తు చేయవచ్చు? సాహిత్యం, రచన, కవిత్వం, సంగీతం, నృత్యం (భరతనాట్యం, కూచిపూడి, కోలాటం), చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, విద్య, వైద్యం, యోగా, పురోహితం, వాస్తు, జ్యోతిష్యం, హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, వ్యవసాయం, సైన్స్ & టెక్నాలజీ, షార్ట్ ఫిల్మ్స్, మాంత్రిక కళలు, వాయిద్య కళలు, టీవీ నాటక కళాకారులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామీణాభివృద్ధి సేవలలో ఉన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆఖరి తేదీ డిసెంబర్ 31, 2025 పురస్కారాల ప్రదానోత్సవం జనవరి 25, 2026న వరంగల్‌లో జరుగనుంది. సంప్రదించవలసిన నెంబర్లను 9100174351, 9494400158 సంప్రదించాలన్నారు
