అయ్యప్ప భక్తుల సంఘం మండల అధ్యక్షులుగా రంజిత్‌కుమార్
మేడ్చల్, బాచుపల్లి, డిసెంబర్ 3 (మనఊరు ప్రతినిధి): అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ఎబిఎబిఎస్) బాచుపల్లి మండల శాఖ అధ్యక్షుడిగా కందిమళ్ళ రంజిత్‌కుమార్‌ను నియమించినట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య తెలిపారు. మండలంలో భక్తుల సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ సంస్థ దిశగా శక్తివంతమైన కార్యాచరణ కోసం రంజిత్‌కుమార్‌ను నియమించినట్లు వివరించారు. నూతన మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రంజిత్‌కుమార్ మాట్లాడుతూ… అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేపడతానని తెలిపారు. బాచుపల్లి మండలంలో అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ బాధ్యతలను అప్పగించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్యకు రంజిత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
