గంగాపురంలో నామినేషన్ల సందడి

గంగాపురంలో నామినేషన్ల సందడి

బీజేపీ అభ్యర్థిగా కనికె గౌరీశంకర్ పత్రాల దాఖలు


జడ్చర్ల రూరల్, డిసెంబరు 3 (మనఊరు ప్రతినిధి): మూడో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గంగాపుర గ్రామపంచాయతీలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున కనికె గౌరీశంకర్ సర్పంచ్ పదవికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ వేళ బీజేపీ కార్యకర్తలు చంద్రప్రకాశ్, కుంభ నరేష్ తదితరులు గౌరీశంకర్‌కు సంఘీభావం ప్రకటిస్తూ హాజరయ్యారు. పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు వ్యవహారం ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా సజావుగా కొనసాగిందని అధికారులు తెలిపారు.
 




Previous Post Next Post