సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం వెంకటాపూర్ తండా
కల్వకుర్తి, డిసెంబరు 4(ప్రతినిధి): వెంకటాపూర్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి ఈసారి ఎస్టీ మహిళ రిజర్వు ఖరారవడంతో గ్రామ పెద్దల సమక్షంలో తండా ప్రజలు ఏకగ్రీవానికి సమ్మతించారు. గత ఎన్నికల్లోనూ ఏకగ్రీవ నిర్ణయంతోనే గ్రామంలో పాలన కొనసాగిన సంగతి తెలిసిందే. అదే పద్ధతి ఈసారి కూడా కొనసాగి గ్రామాభివృద్ధిపై ఐక్యతను చాటుకున్నారు. గ్రామ సర్పంచ్‌గా ఇస్లావత్ లక్ష్మీ శంకర్ నాయక్, ఉపసర్పంచ్‌గా ఇస్లావత్ శాంతి శంకర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. వార్డు సభ్యులుగా మంజుల, శ్రీను, శాంతి, శ్రీను, నీలమ్మ, మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచనల మేరకు ఏకగ్రీవ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు ఉన్నాం. ఎమ్మెల్యే సహకారం తండా అభివృద్ధికి మరింత మెరుగుపడింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు శంకర్‌నాయక్‌తో పాటు స్థానికులు ఉన్నారు.
