వార్డు సభ్యుడుగా పట్లోళ్ల విక్రంరెడ్డి ఏకగ్రీవం

 రాజాపూర్ 11వ వార్డులో పట్లోళ్ల విక్రంరెడ్డి ఏకగ్రీవం

రాజాపూర్, డిసెంబర్ 3 (మన ఊరు ప్రతినిధి): రాజాపూర్ మండల కేంద్రంలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్లోళ్ల విక్రం రెడ్డి వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. 11వ వార్డు సభ్యులు సమైక్యంగా తీర్మానం చేస్తూ విక్రం రెడ్డిని ఏకగ్రీవ అభ్యర్థిగా ప్రకటించారు. వార్డు సభ్యునిగా ఎన్నికైన విక్రం రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. రాజాపూర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా అని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, వార్డు సభ్యులు విక్రం రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Previous Post Next Post