ఆత్మ రక్షణకు కరాటే దోహదం
గితశ్రీ స్కూల్ ప్రిన్సిపాల్ బాల్ రాజ్
ఓవరాల్ చాంపియన్‌షిప్ కప్ గితశ్రీ స్కూల్ సొంతం
జడ్చర్ల, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): ఆత్మ రక్షణకు కరాటే ఎంతో అవసరమని గితశ్రీ స్కూల్ ప్రిన్సిపాల్ బాల్ రాజ్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పట్టణంలోని గితశ్రీ స్కూల్ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రోన్జ్ మెడల్స్ సాధించడంతో పాటు ఓవరాల్ చాంపియన్‌షిప్ కప్ను సాదించిన సందర్భంగా గురువారం విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాల్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విద్యార్థుల విజయాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచుతున్నాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థినులకు కరాటే శిక్షణ ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులకు శిక్షణనిచ్చిన కరాటే మాస్టర్ జాకీర్ కృషిని ప్రశంసిస్తూ, విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, కరాటే విద్యార్థులు, పాల్గొన్నారు.


