నామినేషన్ కేంద్రాల తనిఖీ చేసిన ఎస్పీ జానకి

 బాలానగర్ నామినేషన్ కేంద్రాల తనిఖీ చేసిన ఎస్పీ జానకి

భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని ఆదేశాలు

నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ డి. జానకి

బాలానగర్, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): మండలంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎస్పీ డి. జానకి బుధవారం బాలానగర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, తిరుమలగిరి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు.

ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులు వివరాలు తెలిపినారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమల్లో రాజీ లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నామినేషన్లను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు.

   పెద్దరేవల్లిలో ప్రజలతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ డి.జానకి

Previous Post Next Post