ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి

ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి

విద్యాహక్కు చట్టంలో సవరణ అవసరం

 టిఎస్ టియూ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా

జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (టీఎస్‌టియు) జిల్లా కౌన్సిల్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించబడ్డాయి. జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టంలో తక్షణ సవరణలు చేయాలని, అలాగే ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ–ఉద్యోగులకు డీఏ మంజూరు చేసి పీఆర్సీని అమలు చేయాలని కోరారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలనే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాహేర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు గిరివర్ధన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హమీద్ అలీ, హెడ్‌క్వార్టర్ సెక్రటరీ మహమ్మద్ రహమతుల్లా, జిల్లా బాధ్యులు డాక్టర్ షేక్ ఫరీద్, శశిధర్, మల్లికార్జున్, మోహన్, శరణప్ప, మురళి, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





Previous Post Next Post