టీఎర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కటకం రమేష్

టీఎర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కటకం రమేష్, ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డిలకు శుభాకాంక్షలు 

హైదరాబాద్, డిసెంబర్ 1 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఎర్టీఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గౌడ భవనంలో శనివారం నిర్వహించారని నాగర్ కర్నూల్ జిల్లా టీఎర్టీఎఫ్ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి మునగాల సతీష్ కుమార్ లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 33 జిల్లాల కౌన్సిల్ సభ్యులు పాల్గొని ఏకగ్రీవంగా కొత్త రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా కటకం రమేష్ ని టీఎర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మారెడ్డి అంజిరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా టీఎర్టీఎఫ్ తరఫున జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి మునగాల సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, డిఎల్, పిఆర్సీ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయులకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. టీచర్ల సంక్షేమం, ప్రమోషన్లు, విద్యాభివృద్ధే తమ ఫస్ట్ ప్రయార్టీ అని పేర్కొన్నారు. కటకం రమేశ్ విజ్ఞప్తి చేశారు. ప్రైమరీ స్కూళ్లల్లో పనిచేసే ఎస్జీటీ టీచర్లకూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు. టీచర్లకు బదిలీలు నిర్వహించాలని, పెండింగ్ బిల్లులను పరిష్కరించాలని, ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.


Previous Post Next Post