దత్తాత్రేయని పూజిస్తే గురుబలం ప్రాప్తిస్తుంది...

 వైభవంగా రామాలయంలో దత్తాత్రేయ జయంతి అభిషేక,హోమ పూజలు 

దత్తాత్రేయని పూజిస్తే గురుబలం ప్రాప్తిస్తుంది...

భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు...

రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్..

నాగర్ కర్నూల్, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో మార్గశిర మాసం పౌర్ణమి నాడు శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారికి విశేష ద్రవ్య పంచామృత అభిషేక పూజలు, హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులచే దత్తాత్రేయ స్వామి వారికి వేదమంత్రోచరణాల మధ్య అభిషేక హోమ పూజలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా ప్రతినెల నిర్వహించే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు 12మంది దంపతులతో సామూహికంగా భక్తులచే శాస్త్రోక్తంగానిర్వహించారు.ఈ వ్రతాలు చేయడంతో భక్తులకు కోరిన కోరికలు మరియు వారికి దారిద్ర్యం తొలగి,అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధస్తాయని,విశేషంగా పుణ్య ఫలితం భక్తులకు అందుతుందనీ అన్నారు.

ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు వ్రతాలు నిర్వహిస్తున్నారని,విశేష అభిషేకం,శివభిషేకపూజలు నిర్వహించారు. భగవంతుని అనుగ్రహం సూక్ష్మ మార్గంలో పొందుటకు,దోష నివారణ జరుగుటకు తమకు తోచిన విధంగా తమ శక్త్యానుసారం , పూజలు,వ్రతాలు నిర్వహించడంతో భగవంతుని ప్రసన్నం చేసుకొని వారి ఆపదలు తొలగి,కోరికలు నెరవేర్చే విధంగా స్వామి అనుగ్రహిస్తాడనీ ఆయన తెలిపారు.

ఆలయ ఆవరణలోని శివాలయంలో పరమశివుని భక్తులు దర్శించుకున్నారు. రామాలయ అన్నప్రసాద కమిటీ వారికి సామూహికంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.నిత్య విష్ణుసహస్రనామ పారాయణ కమిటీ సభ్యులు,సాయి భక్తులు స్వామి వారిని కీర్తిస్తూ కీర్తనలు భజనలు చేశారు.భక్తులకు వేద ఆశీర్వచనం,తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో 525మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో అర్చకులు చక్రవర్తి శ్రీనివాస చార్యులు, కందాడై శ్రీనివాసచార్యులు, అన్న ప్రసాద కమిటీ సభ్యులు కందడై జయలక్ష్మి, కరుణశ్రీ , అర్థం రవీందర్, టి.మల్లేష్, గొల్ల రాములు, రమాదేవి, రత్నమాల,శారద, నారాయణ, శివ, పుల్లయ్య, బాలస్వామి, చారి, నరసింహ గౌడ్, సాయిభక్తులు, నిత్య విష్ణు సహస్ర పారాయణం కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






Previous Post Next Post