అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధిని చేపడతాం....

 అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధిని చేపడతాం....

తోటపల్లి గ్రామ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రమణమ్మ 

కల్వకుర్తి, డిసెంబరు 7 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తోటపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రమణమ్మ అన్నారు. ఆదివారం ఆమె గ్రామంలో వివిధ వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను కలిసి మాట్లాడారు. గ్రామ సర్పంచ్ గా గెలిస్తే ఆమె చేసే అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. గ్రామంలోని మురుగు కాలువల నిర్మాణం, సిసి రహదారుల నిర్మాణం, వీధిలైట్ల ఏర్పాటు, గ్రామంలోని వైద్యశాల, పశువైద్యశాల నిర్వహణలో సక్రమంగా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని అర్హత గల పెన్షన్ దారులకు పెన్షన్ వచ్చే విధంగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తానని వివరించారు. గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, భీమయ్య, పరుశరాములు, పర్వతాలు, శేఖర్, రామకృష్ణ, రాము, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post