భక్తిశ్రద్ధలతో దత్తాత్రేయస్వామి జయంతి ఉత్సవాలు

 భక్తిశ్రద్ధలతో దత్తాత్రేయస్వామి జయంతి ఉత్సవాలు

జడ్చర్ల, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకరణ, సహస్రనామ ఆర్చన సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తరువాత భక్తులంతా కలిసి మహా నైవేద్యం సమర్పించారు.


భజనలు, భక్తిగానాలతో దేవాలయ పరిసరాలు మారుమోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు రాజేష్ శర్మ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, శ్రీను, సురేఖ, హనుమంతరావు, వాసవి, గోనెల రాధాకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో భజనమండళి సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.


Previous Post Next Post