సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకే ప్రాధాన్యం

 సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకే ప్రాధాన్యం 

డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్, జడ్చర్ల, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థుల విజయం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సూచించారు. జడ్చర్ల పట్టణంలో సీనియర్ నాయకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన స్థానిక ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. పార్టీ కోసం కష్టపడి, ప్రజల మధ్య నిస్వార్థంగా పనిచేసిన వారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం మరియు సముచిత బాధ్యతలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించి పూర్తి స్థాయిలో కృషి చేయాలని సంజీవ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మినాజ్, పిసిసి సభ్యులు అశోక్ యాదవ్, మాజీ ఎంపిపి నిత్యానందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బి. మధుసూదన్ రెడ్డి, వెంకటేశం, అఫ్రోజ్, గోప్లాపూర్ యాదయ్య, నరసింహ యాదవ్, ప్రవీణ్ కుమార్, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.








Previous Post Next Post