ఏకగ్రివంగా ఎన్నికైన బండోన్‌పల్లి సర్పంచ్‌గా ఎనుముల సంగీతారెడ్డి ఏకగ్రివంగా ఎంపిక
వెల్దండ, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): వెల్దండ మండలంలోని బండోన్‌పల్లి గ్రామ పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవాలతో హర్షాతిరేకంగా మారింది. గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి సహా మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రిటర్నింగ్ అధికారి వారందరికీ నియామక పత్రాలు. ఈ సందర్భంగా సర్పంచ్ సంగితారెడ్డి మాట్లాడుతూ మొత్తం 642 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో అన్ని స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గ్రామ ఐక్యతకు నిదర్శనం. మా కుటుంబంపై, నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఏన్నా వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తాను అని చెప్పారు. గ్రామస్తులు, పాలకవర్గంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతీక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ముందుకు సాగుతామని తెలిపారు. మహిళలకు రాజకీయాల్లో ఇంత పెద్ద స్థానం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు సంగీతా రెడ్డి.




