ఒక్క అవకాశం ఇవ్వండి తలకొండపల్లిని అభివృద్ధి చేస్తా...
తలకొండపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థి జుట్టు తిరుపతి...
కల్వకుర్తి, డిసెంబరు 7 (మనఊరు ప్రతినిధి): ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ తలకొండపల్లి సర్పంచ్ అభ్యర్థి జుట్టు తిరుపతి ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తలకొండపల్లి మండల కేంద్రానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు ఒక్క అవకాశం ఇవ్వండి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని గడపగడపకు తిరిగి ఓటు అడుగుతున్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ సహాయ సహకారాలను అందిస్తున్నారు. పదవిలో లేకపోయినా, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత నిబద్ధతతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామస్తులు కలిసి పనిచేయడం, విద్యా, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఉపాధి వంటి రంగాలపై దృష్టి సారించడం ద్వారా అభివృద్ధి చెందుతుందని లక్ష్యంతో పని చేస్తున్నారు. తలకొండపల్లి అభివృద్ధిగా తన వంతు కృషి చేస్తానని జుట్టు తిరుపతి అన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని తలకొండపల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరారు.
