అనారోగ్యంతో ఉన్న విలేకరి కృష్ణయ్యను పరామర్శించిన నాయకులు
కల్వకుర్తిలో అనారోగ్యంతో ఉన్న విలేకరి కృష్ణయ్యకు నాయకుల పరామర్శ
కల్వకుర్తి, మార్చి 24 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి పట్టణానికి చెందిన మన తెలంగాణ విలేకరి కృష్ణయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ శానవాజ్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, కోడెల గణేష్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, దామోదర్ గౌడ్, వెంకట్ రెడ్డి, విలేకరి శ్రీధర్ తదితరులు కృష్ణయ్యను కలిసి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా సమస్యలపై తన కలంతో సేవ చేయాలని ఆకాంక్షించారు. విలేకరి కృష్ణయ్య ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో సేవలందిస్తున్నారని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.
