ఘనంగా మనసున్న మహారాజు దేవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు
స్వర నీరాజనాలతో అలరించిన గాయని-గాయకులు..
సేవా కార్యక్రమాలకు ప్రశంసలు
హైదరాబాద్, జూన్ 9 (మనఊరు ప్రతినిధి): డి భారతి ఫౌండేషన్, ఆనంద లహరి కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, కల్చరల్ ఈవెంట్స్ చైర్మన్ దేవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు సోమవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎలైట్ ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సాగిన ఈ వేడుకలు ఉల్లాసభరితంగా, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా కొనసాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరిలో పలువురు గాయని, గాయకులు తమ మధుర గానాలతో స్వర నీరాజనాలు అర్పించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి పీవీపీ అంజనీ కుమారి మాట్లాడుతూ, దేవేందర్ గౌడ్ సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సమాజ సేవకు అంకితభావంతో పనిచేస్తూ, తన ఆధ్వర్యంలోని సంస్థల ద్వారా అనేక మంది అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సమాజానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తిగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని డి భారతి ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి ఆనంది సమర్థవంతంగా నిర్వహించారు. వేడుకల్లో గాయని-గాయకులు లక్ష్మీ-గోపాల్ దంపతులు, రాణి, సప్న, వాసు, వినోద్, రమేష్, ప్రసన్న, ఆరోరా, విల్సన్, భానుమూర్తి తదితరులు పాల్గొని తమ గానామృతంతో సభను అలరించారు. అలాగే ఆనంద్, భారతీదేవి కుటుంబ సభ్యులు, మురళి, స్వప్న, రమాదేవి, వినోద్, గిరి, సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని దేవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా శ్రీమతి రమా తన అద్భుత గాన ప్రతిభతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. సంగీతం, స్నేహం, సేవా స్పూర్తి కలగలిపిన ఈ జన్మదిన వేడుకలు పాల్గొన్న వారందరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి. దేవేందర్ గౌడ్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని పలువురు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
