ఔట్సోర్సింగ్ ఉద్యోగి హఠాన్మరణం

ఔట్సోర్సింగ్ ఉద్యోగి హఠాన్మరణం

మెడికల్ కళాశాలలో విషాదం

గుండెపోటుతో 35 ఏళ్ల బింగి వెంకటేష్ మృతి

సహచరుల నివాళులు


నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 25 (మన ఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి బిజినపల్లికి చెందిన బింగి వెంకటేష్ (35) మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా హఠాన్మరణం చెందారు. అనూహ్యంగా గుండెపోటు రావడంతో వెంటనే చికిత్స అందించే ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆయన ప్రాణాలు నిలువలేకపోయినట్లు సహచరులు తెలిపారు. యువకుడైన వెంకటేష్ అకాల మృతి కుటుంబ సభ్యులను, సహోద్యోగులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. వెంకటేష్ మృతికి ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులు, సిబ్బంది, అలాగే ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వైద్యులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానికంగా వినయశీలి, కర్తవ్యనిరతిగా పేరుపొందిన వెంకటేష్ మృతి పట్ల బిజినపల్లి గ్రామంలోనూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.