దేవాలయం వద్ద వీధి కుక్కల బీభత్సం..

గుండాల అంబ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద వీధి కుక్కల బెడద..

గుండాల దేవాలయం వద్ద వీధి కుక్కల బీభత్సం.. 

భక్తులపై దాడులు.. చైర్మన్ సందీప్ రెడ్డి, ఈవో ప్రసాద్ నిర్లక్ష్యం!

వెల్దండ, మార్చి 24 (మనఊరు ప్రతినిధి): వెల్దండ మండలంలోని గుండాల శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోంది. దేవాలయానికి వచ్చే భక్తులు, స్థానిక గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల దేవాలయం వద్ద పలువురిపై కుక్కలు దాడి చేసి కరిచిన ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా దేవాలయానికి వచ్చే చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ కుక్కల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు దర్శనానికి వచ్చిన సమయంలోనే కుక్కలు వెంటపడటం, మొరగడం, దాడి చేయడం వల్ల భయం నెలకొంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేవాలయ చైర్మన్ సందీప్ రెడ్డి, ఈవో ప్రసాద్ సమస్యను పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ వీధి కుక్కలను వెంటనే తరలించి, దేవాలయ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.