ఘనంగా ఎల్లికట్టలో ఎల్లమ్మదేవి వీధి నాటకం

గ్రామ సంస్కృతికి అద్దం పట్టిన ఎల్లమ్మ దేవి నాటకం

ఎల్లమ్మ తల్లి మహిమతో అలరించిన వీధి నాటకం

ఎల్లికట గ్రామంలో భక్తి భావంతో ఘనంగా నిర్వహణ

కల్వకుర్తి, మార్చి 18 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని ఎల్లికట్ట గ్రామంలో ఎల్లమ్మ దేవి వీధి నాటకం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వీధి నాటకం ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ వీధి నాటకం గ్రామ ప్రజలను భక్తి భావంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా కళాకారులు ఎల్లమ్మతల్లి మహిమ, గ్రామ సంస్కృతి, ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. నాటక ప్రదర్శనలో భక్తి గేయాలు, సంప్రదాయ వేషధారణలు, సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు యువతకు సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పంతులు లక్ష్మణ్, తబలిసులు వెంకటాచారి, కుమ్మరి యాదగిరి, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.