ఇంట్లోనే ఉరేసుకుని ఉపాధ్యాయురాలి మృతి

ఇంట్లోనే ఉరేసుకుని ఉపాధ్యాయురాలి మృతి

ఉరేసుకుని ఉపాధ్యాయురాలి విషాద మృతి

కుటుంబం లేని వేళ అఘాయిత్యం.. 

వనపర్తిలో కలకలం.. 

వనపర్తి, మార్చి 16 (మనఊరు ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని న్యూటౌన్ కాలనీలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు రాకాసి శ్రీదేవి (45) తన నివాసంలో ఉరేసుకుని మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలు శ్రీదేవి గత కొన్ని రోజులుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆదివారం భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని గమనించగా ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో న్యూటౌన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయురాలి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.