క్షయ వ్యాధిపై వైద్య విద్యార్థులతో ప్రజల్లో చైతన్యం

బిజినేపల్లిలో క్షయ వ్యాధి అవగాహన ర్యాలీ.. 

వైద్య కళాశాల విద్యార్థుల చైతన్య యాత్ర

బిజినపల్లిలో క్షయ అవగాహన ర్యాలీ.. 

వైద్య విద్యార్థులతో ప్రజల్లో చైతన్యం

బిజినేపల్లి మార్చి 24 (మనఊరు ప్రతినిధి): ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంతో బిజినపల్లి మండల కేంద్రంలో సోమవారం వైద్య కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బిజినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీని నాగర్‌కర్నూల్ వైద్య కళాశాల 2024 బ్యాచ్ విద్యార్థులతో కలిసి వైద్యాధికారి డాక్టర్ పి. సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయడంతో పాటు వ్యాధి నిర్మూలన కూడా సాధ్యమవుతుందని తెలిపారు. క్షయ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రధాన రహదారి వెంబడి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆరోగ్య సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్థులు నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ నరేష్, మెడికో సోషల్ వర్కర్ డి. బాలమ్మ, హెల్త్ సూపర్వైజర్లు అశోక్ కుమార్, చంద్రశేఖర్, క్షయ వ్యాధి సూపర్వైజర్ శ్రీనివాసులు, ఆరిఫ్, శ్రావణ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కే. మంగ, శ్వేత, ఆశా కార్యకర్తలు, వైద్య కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.