అనారోగ్య బాధిత తల్లికి ‘ఆరోగ్య రక్ష పెన్షన్’ అందించిన సహాయం వెల్ఫేర్ సొసైటీ
జడ్చర్ల, మార్చి 25 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణంలో సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తున్న సహాయం వెల్ఫేర్ సొసైటీ, కొంగలి శ్రీకాంత్ ఫౌండేషన్ (KSF) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘ఆరోగ్య రక్ష పెన్షన్’ పథకం ద్వారా అనారోగ్యంతో బాధపడుతూ ప్రతిరోజూ మందులు అవసరమయ్యే ఓ నిరుపేద తల్లికి ప్రతి నెల రూ.516/- పెన్షన్ అందజేసింది. ఈ సందర్భంగా సహాయం వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ డా. కొంగలి శ్రీకాంత్ అడ్వకేట్ స్వయంగా బాధితురాలికి KSF ఆరోగ్య రక్ష పెన్షన్ అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేదలు, అనారోగ్య బాధితులకు అండగా నిలవడం తమ ప్రధాన లక్ష్యమని, సమాజంలో అవసరమైన వారికి తోడుగా ఉండాలని ఆయన తెలిపారు. అలాగే “Join With Us – Help The Poor” అనే సందేశంతో సహాయం వెల్ఫేర్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల బాధ్యతతో ముందుకు వస్తున్న సహాయం వెల్ఫేర్ సొసైటీ సేవలను స్థానికులు అభినందించారు. అనారోగ్య బాధిత తల్లికి ఆరోగ్య రక్ష పెన్షన్ అందించిన సహాయం వెల్ఫేర్ సొసైటీ. ఈ కార్యక్రమంలో KSF సభ్యులు సురేష్, హర్షవర్ధన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
