పాటల పరవశంలో పురస్కారాల పరిమళం..

పాటల పరవశంలో పురస్కారాల పరిమళం.. 

వావ్ మ్యూజిక్ కార్యక్రమం విజయవంతం

ఉగాది సంబరాలు ఘనంగా

‘వావ్ మ్యూజిక్’ వేదికపై సంగీత

సాహిత్య రంగుల హరివిల్లు

హైదరాబాద్, మార్చి 18 (మనఊరు ప్రతినిధి): ఉమెన్స్ డే వేడుకల సందడి, రాబోయే ఉగాది పండుగ ఉత్సాహం, మధురమైన సంగీత రాగాల సమ్మేళనంతో ‘వావ్ మ్యూజిక్ సాహితీ సేవా సంస్థ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కనులపండుగగా సాగింది. సంస్థ అధినేత్రి, గాయని పి.వి. లక్ష్మీ, కోఆర్గనైజర్ శ్రీనివాస్ రామరాజు ఆధ్వర్యంలో బుధవారం హిమాయత్‌నగర్‌లోని శ్రీముఖి కాంప్లెక్స్, శారదా స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పివిపి అంజనీ కుమారి మాట్లాడుతూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది పురస్కారాలు మరియు నారీ ప్రతిభ పురస్కారాలు అందుకుంటున్న వారిని అభినందించారు. సంగీత, సాహిత్య, సామాజిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని ప్రోత్సహించడం ద్వారా సమాజంలో మరింత ఉత్తేజం కలుగుతుందని పేర్కొన్నారు. వావ్ మ్యూజిక్ ఫౌండర్ చైర్‌పర్సన్ పి.వి. లక్ష్మీ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. ఆత్మీయ అతిథిగా హాజరైన యువతేజ ట్రస్ట్, తిరుపతి అధ్యక్షులు కరీముల్లా మాట్లాడుతూ, పురస్కారాల ఎంపికలో ప్రతిభ, సేవాభావం, అంకితభావాన్ని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. వేదికపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో అర్హులేనని, ఇంకా మెరుగైన ప్రతిభతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు గాయని–గాయకులు, నిర్వాహకులు, యాంకర్లు, సామాజిక సేవకులు ‘ఉగాది పురస్కారాలు’, ‘నారీ ప్రతిభ పురస్కారాలు’ అందుకున్నారు. పురస్కార గ్రహీతల్లో శారద, జి. సుబ్బరామన్, నాగమణి, అంజయ్య గుప్తా, అరుణ్ రామ్, లక్ష్మీరత్నం, ఆనంద్, దేవేందర్ గౌడ్, స్వప్న, నరేష్ విశాఖపట్నం, మల్లాది ఉష, సావిత్రి కృష్ణమూర్తి, అంజనీ కుమారి, కరీముల్లా యువతేజ ట్రస్ట్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా గాయని–గాయకులు తమ మధుర గానంతో సభను రంజింపజేశారు. నాగమణి, ఆనంది, పవిత్ర, జి. శ్రీనివాస్, కే. మురళి, రమేష్, ఏ. శ్రీనివాస్, రణధీర్, బీఎస్‌ఎన్‌ఎల్ ప్రసాద్ జార్జ్, లక్ష్మీనారాయణ, భానుమూర్తి తదితరులు తమ గానంతో ప్రేక్షకులను అలరించారు. వ్యాఖ్యాతగా మనోహర్ చమత్కారమైన వ్యాఖ్యానంతో సభను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్, మార్కాపురం తరఫున సంస్థ అధినేత చెన్నకేశవులు వారు పి.వి. లక్ష్మీ, శ్రీనివాస్ రామరాజులకు ‘మేరా భారత్ మహాన్ అవార్డు–2026’, ‘మదర్ థెరిస్సా అవార్డు’, మహిళా దినోత్సవం సందర్భంగా ‘స్త్రీ శక్తి అవార్డు–2026’ లను ప్రదానం చేయడం విశేషం. మొత్తం మీద ఉమెన్స్ డే వేడుకలతో పాటు ఉగాది సంబరాలను ఒకే వేదికపై సంగీత–సాహిత్య–సామాజిక సేవా స్ఫూర్తితో అద్భుతంగా ఆవిష్కరించిన ఈ కార్యక్రమం హాజరైన వారిని, ఆన్‌లైన్‌లో వీక్షించిన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.