ఉపాధ్యాయుల జీపీఎఫ్, మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలి

ఉపాధ్యాయుల జీపీఎఫ్, మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలి 

ఎస్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి 

నడింపల్లిలో ఘనంగా అర్జునయ్య సన్మానం.. 

అచ్చంపేట, మార్చి 25 (మనఊరు ప్రతినిధి): అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్జునయ్య పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) నాయకులు ప్రభుత్వంపై పలు కీలక డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్. మురళి, జిల్లా కార్యదర్శి కొత్త శ్రీధర్ రావులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వడ్డే హనుమంత రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించవలసిన జీపీఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులు వంటి పెండింగ్ బకాయిలను సంవత్సరాలుగా నిలిపివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని విడుదల చేసి ఉపాధ్యాయులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా, రెండవ పీఆర్‌సీని ప్రకటించి అమలు చేయాలని, పర్యవేక్షక పోస్టులైన ఎంఈఓ, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో అచ్చంపేట మండల అధ్యక్షుడు నారాయణ గౌడ్, కార్యదర్శి భాస్కర్, వివిధ మండలాల నాయకులు చంద్రశేఖర్, విష్ణు, నరేందర్ రెడ్డి, ప్రవీణ్, శ్రీకాంత్, రాజు, కృష్ణయ్య, శ్రీనివాస్, ఈశ్వర్, బ్రహ్మేంద్ర యాదవ్, సృజన, కవిత, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర నాయకులు పోకల సతీష్, రవి శేఖర్, కొంగరీ రమేష్ ప్రభాకర్, ఎం. సుదర్శన్, విద్యాసాగర్ సత్యనారాయణ, కాశన్న తదితర సీనియర్ నాయకులు హాజరై అర్జునయ్యకు ఘనంగా సన్మానం చేశారు. పదవీ విరమణ పొందిన అర్జునయ్య విద్యా రంగానికి అందించిన సేవలను నాయకులు కొనియాడుతూ, ఆయన భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.