చటాన్‌పల్లి చెరువులో కారు పడి కలకలం
షాద్‌నగర్‌లో అర్ధరాత్రి సంచలనం..
చెరువులోకి దూసుకెళ్లిన కారు
అదుపుతప్పి చెరువులో పడిన కారు.. లోపల ఎవరున్నారు? అనుమానాలు
చటాన్‌పల్లి చెరువులో కారు మునిగిపోతుందంటూ ప్రత్యక్ష సాక్షుల వాదన
జనాల్లో ఆందోళన..
చెరువులో పడిన కారుపై స్పష్టత లేదు
షాద్‌నగర్, మార్చి 12 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి చెరువులో కాసేపటి క్రితం ఓ కారు ప్రమాదవశాత్తు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కారు లో ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. స్థానికుల కథనం ప్రకారం కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి చెరువులో పడిందా, లేక మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి గురయ్యిందా అన్న అంశాలపై స్పష్టత లేదు. మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చెరువులో పడ్డ కారు దృశ్యాలు కనిపిస్తుండగా, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చూస్తున్నారు. అయితే సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి ఇప్పటివరకు కనిపించడంలేదు. కారు క్రమంగా మునిగిపోతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

