లారీ ఢీకొని యువకుడు మృతి…

 లారీ ఢీకొని యువకుడు మృతి… 

చెన్నవెల్లి గ్రామంలో విషాదం

రాజాపూర్, మార్చి 12 (మనఊరు ప్రతినిధి): రాజాపూర్ మండల పరిధిలోని చెన్నవెల్లి గ్రామానికి చెందిన చిల్వేరి నరేష్ గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం… నరేష్ రాజాపూర్ నుండి షాద్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. షాద్‌నగర్ సమీపంలోని ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న నరేష్ మృతి వార్త తెలియగానే చెన్నవెల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.