కల్వకుర్తిలో మటన్ షాప్ కు పోతున్నారా ?
స్టాంపు ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి
కల్వకుర్తిలో మటన్ దుస్తులను తనిఖీలు నిర్వహించిన వెటర్నరీ డాక్టర్ నాగరాజు
కల్వకుర్తి, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): కల్వకుర్తి పట్టణంలోని మటన్ మార్కెట్ లో మహబూబ్ నగర్ చౌరస్తాలో మంగళవారం మటన్ షాపులపై ఆదివారం వెటర్నరీ డాక్టర్ నాగరాజు తనిఖీలు ఉన్నాయి. ఈ సందర్భంగా పలు మటన్ షాపులలో మాంసాన్ని పరిశీలించారు. మహబూబ్ నగర్ చౌరస్తాలో మటన్ విక్రయిస్తున్న రమేష్, నిరంజన్ లు గొర్రె మాంసానికి గొర్రె పొట్టేలు మాంసం అని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శుభ్రమైన మాంసం అని ముద్ర వేసిన తర్వాత ప్రజలకు విక్రయించాలని అన్నారు. కబేళాల్లో కోసిన మేకలు గొర్రెల మాంసాన్ని వాటిని దుకాణాల్లో విక్రయించాలి అని తెలిపారు. మాంసం దుకాణాల్లో శుభ్రత పాటించాలని, వ్యర్ధాలను దూరంగా పారబోయాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు షాపులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.