మరికల్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

మరికల్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

తీరొక్క పూలతో బతుకమ్మల అలంకరణ.. 

ఆటపాటలతో మహిళల సందడి

చౌడాపూర్, అక్టోబరు 18 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌, గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.