రవీంద్ర భారతిలో జడ్చర్ల కళాకారుల ప్రతిభకు ప్రశంసలు
చారిత్రక గాథలను నాటక రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తాం
కళాకారులు బాదిమి ధ్రువ
హైదరాబాద్, అక్టోబరు 22 (మనఊరు ప్రతినిధి): చారిత్రక వ్యక్తుల జీవితాలు, వారి పోరాట స్ఫూర్తిని నాటక రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లడం ద్వారా నేటి తరానికి చరిత్రను చేరువ చేయవచ్చని పండుగ సాయన్న పాత్రధారి బాగ్ని ధ్రువ అన్నారు. పండుగ సాయన్న 174వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జడ్చర్లకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ధ్రువ మాట్లాడుతూ జడ్చర్ల ప్రాంతానికి చెందిన కళాకారులకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తమ నటనా ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించడం గర్వకారణమన్నారు. పండుగ సాయన్న వంటి చారిత్రక వ్యక్తుల జీవితాలను నాటక రూపంలో ఆవిష్కరించడం ద్వారా వారి స్ఫూర్తి, త్యాగాలను ప్రజలకు తెలియజేయవచ్చన్నారు. భవిష్యత్తులోనూ చారిత్రక, సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా తీసుకొని మరిన్ని నాటకాలను ప్రదర్శిస్తూ కళారంగానికి సేవ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్చర్లకు చెందిన నాటకంలో పాల్గొన్న జడ్చర్ల కళాకారులు శశిధర్ రెడ్డి, జీవన్ గుండప్ప, వెంకటరమణాచార్యులు, జి. సత్యం, పలువురు కళాకారులు పాల్గొని వివిధ పాత్రలను పోషించారు. వారి నటన, హావభావాలు, సంభాషణలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కార్యక్రమానికి హాజరైన కళాకారులు, సాహితీవేత్తలు, కళాభిమానులు నాటక ప్రదర్శనను వీక్షించి కళాకారులను అభినందించారు.








