క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

 

 క్రీడాకారులకు వాలీబాల్ కిట్, ఐమాక్స్ లైట్స్,కుర్చీలు బహుకరించారు

యువ నాయకుడు తుప్పర రవీందర్

కొత్తూరు, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని యువ నాయకుడు తుప్పర రవీందర్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ వాడలో అంగన్‌వాడి కేంద్రంలో యువ నాయకుడు తుప్పర డబ్బులతో క్రీడాకారులకు మైదానం ఏర్పాటు చేశారు. అలాగే క్రీడాకారులకు వాలీబాల్ కిట్, ఐమాక్స్ లైట్స్,కుర్చీలు బహుకరించారు. అనంతరం క్రీడాకారుల యువ నాయకుడు తుప్పర రవీందర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రోళ్ల లక్ష్మయ్య,బి సురేందర్, జి నవీన్,జి వినోద్, టి అనిల్, బి నాగ, చింటూ, క్రీడాకారులు ఉన్నారు. 

Previous Post Next Post