శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలు నిలిపిన ట్రాఫిక్ పోలీసులు

 శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలు నిలిపిన ట్రాఫిక్ పోలీసులు 




కర్నూల్, మార్చి 30 (మనఊరు న్యూస్): ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆదివారంహైదరాబాద్, మహబూబ్ నగర్, తదితర జిల్లాల నుంచి వచ్చే వహనాలను నాగర్ కర్నూల్ జిల్లా సుండిపేట్ వద్ద సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9: 30 నిమిషాలు అయినా కూడా పైనుంచి వచ్చే వాహనాలు రద్దీ ఇంకా తగ్గడం లేదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఉగాది రోజున 90శాతం వరకు ఉంటారని భక్తులు అంటున్నారు. భక్తులు దర్శనం చేసుకుని అధిక సంఖ్యలో ఉన్నందున భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కింద నుంచి శ్రీశైలం గుట్ట పైకి వెళ్లే భక్తులకు పైనుంచి వచ్చే వాహనాలు క్లియర్ అయినా వెంబడే కింద నుంచి పైకి వెళ్లే వాహనాలను పంపిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.