దేవాలయ నిర్మాణాలు... గ్రామాల అభివృద్ధికి నిలయాలు

 *దేవాలయ నిర్మాణాలు... గ్రామాల అభివృద్ధికి నిలయాలు*

*పిట్టల గడ్డ తండాలో ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం*

*ఆంజనేయ స్వామి విగ్రహ దాత ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి* 



షాద్ నగర్, మార్చి 27 (మనఊరు న్యూస్): దేవాలయ నిర్మాణాలు గ్రామాల అభివృద్ధికి నియాలు అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ వారి కందివనం గ్రామం వద్దగల పిట్టల గడ్డ తండాలో తండా వాసులు నూతనంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం అయినది. నిర్మాణానికి సంబంధించిన దేవాలయంలో ప్రతిష్టింప చేయడానికి కావలసిన విగ్రహానికి ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ దేవాలయ విరాళం ఇచ్చారు. విగ్రహానికి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి విరాళం ఇచ్చినందుకు తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. శాసనమండలిలో సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్ రెడ్డికి బదులుగా మాజీ ఎంపీటీసీ కట్న మాధవి రవీందర్, మొగిలిగిద్ద గ్రామ నాయకుడు గుట్ట రాజు పాల్గొని విగ్రహ విరాళాన్ని తండావాసులకు అందించారు. ఈ కార్యక్రమంలో తండా వాసులతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.